Mancherial: మంచిర్యాలలో కాకా వెంకటస్వామి విగ్రహ ఆవిష్కరణ కలకలం!
Mancherial: మంచిర్యాలలో కాకా వెంకటస్వామి విగ్రహ ఆవిష్కరణ కలకలం. కాంగ్రెస్‌లో మళ్లీ తెరపైకి వచ్చిన వర్గ విభేదాలు, ఉద్రిక్తంగా మారిన రాజకీయం.
Mancherial: మంచిర్యాలలో కాకా వెంకటస్వామి విగ్రహ ఆవిష్కరణ కలకలం!
Mancherial: మంచిర్యాల జిల్లాలో కాకా విగ్రహ ఆవిష్కరణ రాజకీయంగా కాక రేపుతోంది. జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో కొన్నేళ్లుగా కవర్‌తో కప్పి ఉంచిన కాకా గడ్డం వెంకటస్వామి విగ్రహాన్ని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్‌రావు వ్యతిరేక వర్గానికి చెందిన మంతెన జగన్‌మోహన్‌రావు, మాజీ వైస్ చైర్మన్ ఉప్పలయ్యతో పాటు భారీ సంఖ్యలో కార్యకర్తలు కవర్ తొలగించి ఆవిష్కరించారు. అనంతరం విగ్రహానికి పాలాభిషేకం పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అయితే ఈ విగ్రహ ఆవిష్కరణతో మంచిర్యాల జిల్లా కాంగ్రెస్‌లో మరోసారి వర్గ విభేదాలు తెరపైకి వచ్చాయి. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్‌రావు వర్సెస్ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి వర్గాల మధ్య రాజకీయ సమీకరణలు ఆసక్తికరంగా మారుతున్న వేళ.. కాకా విగ్రహ ఆవిష్కరణ ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఈ ఆవిష్కరణ వెనుక రాజకీయ ఉద్దేశం ఏంటి..? రాబోయే రోజుల్లో మంచిర్యాల జిల్లా రాజకీయాలపై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది ? అనేది ఆసక్తికరంగా మారింది.




