Nirmal: ఖానాపూర్‌లో వైభవంగా అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవ వేడుకలు!
Nirmal: ఖానాపూర్ కొమరం భీమ్ చౌరస్తాలో అంబరాన్నంటిన అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవ వేడుకలు. హాజరై నివాళులర్పించిన స్థానిక ఎమ్మెల్యే బొజ్జు పటేల్.
Nirmal: ఖానాపూర్‌లో వైభవంగా అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవ వేడుకలు!
Nirmal: నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. ఖానాపూర్ పట్టణంలోని ప్రముఖ కొమరం భీమ్ చౌరస్తాలో ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ముఖ్య అతిథిగా హాజరై, ఆదివాసి సోదరులతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు.
అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఖానాపూర్ కొమరం చౌరస్తా ఆదివాసి సంస్కృతీ సంప్రదాయాలతో కళకళలాడింది. విప్లవ వీరుడు కొమరం భీమ్ విగ్రహానికి ఎమ్మెల్యే బొజ్జు పటేల్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆదివాసి బిడ్డలు తమ సాంప్రదాయ దుస్తులు ధరించి, డప్పు వాయిద్యాల నడుమ చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
ఈ వేడుకలకు నియోజకవర్గ నలుమూలల నుండి ఆదివాసి బిడ్డలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. జల్, జంగిల్, జమీన్ కోసం పోరాడిన అమరవీరుల ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా ఆదివాసి నాయకులు ప్రతిజ్ఞ చేశారు. తమ హక్కుల సాధన కోసం, సంస్కృతి పరిరక్షణ కోసం ఇలాంటి వేడుకలు ఎంతో స్ఫూర్తినిస్తాయని వారు పేర్కొన్నారు.




