Khanapur: ఖానాపూర్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో అధికారుల సర్వే
Khanapur: నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని డబుల్ బెడ్రూం ఇళ్లలో అనర్హులను ఏరివేసేందుకు కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఇంటింటి సర్వే చేపట్టారు.
Khanapur: ఖానాపూర్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో అధికారుల సర్వే
ఖానాపూర్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని డబుల్ బెడ్రూం ఇళ్లలో అనర్హులను తొలగించి అర్హులకు ఇళ్లు కేటాయించాలని బాధితులు పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించగా జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశాలతో ఖానాపూర్ తహసీల్దార్,మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో రెవెన్యూ, మున్సిపల్ సిబ్బందితో డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు.
పలు ఇళ్లకు తాళాలు వేసి ఉన్న ఇండ్లను అధికారులు గుర్తించారు. సర్వే పూర్తి చేసి ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని అధికారులు తెలిపారు.
అర్హులకు ఇళ్లు దక్కేలా చర్యలు తీసుకోవాలని. బాధితులు అధికారులను కోరగా తప్పకుండా తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు...




