Kotapalli: ఎసన్వాయిలో పోలీసులు, ఎక్సైజ్ దాడులు!

Kotapalli: మంచిర్యాల జిల్లా ఎసన్వాయిలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్. 35 వాహనాలు సీజ్, 1,000L బెల్లం పానకం ధ్వంసం, 9 మందిపై ఎక్సైజ్ కేసులు.

RAJENDER, CHENNUR
Published on: 25 July 2026 1:36 PM IST
Kotapalli
X

Kotapalli: ఎసన్వాయిలో పోలీసులు, ఎక్సైజ్ దాడులు!

Kotapalli: కోటపల్లి మండలంలోని ఎసన్వాయి గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం ని నిర్వహించిన కోటపల్లి పోలీసులు.

ఈ కార్యక్రమంలో పోలీస్ మరియు ఎక్సైజ్ శాఖ సంయుక్త ఆకస్మికంగా దాడులు నిర్వహించారు.

గ్రామంలోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సరైన ధృవపత్రాలు లేని 35 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.

అక్రమంగా నిలువ ఉంచిన సుమారు 1,000 లీటర్ల గుడుంబా తయారీలో ఉపయోగించే బెల్లం పానకాన్ని పోలీసులు ధ్వంసం చేశారు.

గ్రామంలో అక్రమంగా విక్రయిస్తున్న సుమారు 30 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు.

అక్రమంగా గుడుంబా తయారు చేస్తున్న 9 మంది గుర్తించి వారిపై ఎక్సైజ్ పోలీసులు కేసులు నమోదు చేశారు.

అనంతరం, గుడుంబా నిర్మూలనపై గ్రామస్తులకు అవగాహన కల్పించి, గ్రామాలలో ఎవరైనా గుడుంబాను తయారుచేసిన లేదా విక్రయించిన కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా హెచ్చరించారు.

ప్రభుత్వ నిషేధిత గుడుంబా తయారీ మరియు విక్రయాలు చట్ట విరుద్ధమని, అలాంటి కార్యకలాపాల్లో పాల్గొనవద్దని గ్రామస్థులకు ఏసీపీ వెంకటేశ్వర్లు సూచించారు.

గ్రామాలలో ప్రజల భద్రత శాంతిభద్రతల పరిరక్షణ కోసమే ఇలాంటి కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సైబర్ నేరాలు, రోడ్డు భద్రతా నియమాలు, వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ సీటు బెల్టు వాడటం, గుడుంబా, గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలన, సీసీ కెమెరాలు వంటి పలు అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

RAJENDER, CHENNUR

RAJENDER, CHENNUR

Next Story