Bellampalli: విద్యాసంస్థల బంద్ ప్రశాంతం వామపక్ష విద్యార్థి సంఘాల ఆందోళన!

Bellampalli: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్.

PRATHAP, BELLAMPALLI
Published on: 24 July 2026 12:51 PM IST
Bellampalli
X

Bellampalli: విద్యాసంస్థల బంద్ ప్రశాంతం వామపక్ష విద్యార్థి సంఘాల ఆందోళన!

Bellampalli: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో వామపక్ష విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్

ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాల తెలంగాణ రాష్ట్ర కమిటీల పిలుపులో భాగంగా విద్యాసంస్థల బంద్ AIFDS రాష్ట్ర సహాయ కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్, యంసిపిఐ(యు) పార్టీ జిల్లాకార్యదర్శి పసులేటి వెంకటేష్,పి.డి.ఎస్. యు జిల్లా అధ్యక్షుడు రెడ్డి చరణ్, ఎస్.ఎఫ్.ఐ నాయకులు అభిషేక్ ల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.

అనంతరం వారు మాట్లాడుతూ....దేశ విద్యార్థుల, యువత రక్తం చూడటమేనా దేశభక్తి? అని,విద్యార్థి ఉద్యమాలపై దమనకాండను వెంటనే నిలిపివేయాలని,దేశంలో బీజేపీ ప్రభుత్వం బ్రిటీష్ పాలనను తలపించే విధంగా వ్యవహరిస్తోందని, ప్రజాస్వామ్య హక్కులకోసం పోరాడుతున్న విద్యార్థులు, యువతపై నిర్బంధ చర్యలు ఖండనీయమని,ఢిల్లీలో పార్లమెంట్ మార్చ్ సందర్భంగా విద్యార్థులు, యువతపై జరిగిన లాఠీచార్జీ, బాష్పవాయువు ప్రయోగం, దాడులు చేయడం సిగ్గు చేటని,

విద్యార్థి, యువతపై జరిగిన దాడులకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెంటనే మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేయాలని, న్యూఢిల్లీలోని జంతర్ మంతర్‌లో కొనసాగుతున్న విద్యార్థి ఉద్యమానికి సంఘీభావంగా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు వామ పక్ష విద్యార్థి సంఘాల తెలంగాణ రాష్ట్ర కమిటీల పిలుపులో భాగంగా విద్యా సంస్థలను బంద్ నిర్వహించడం జరిగింది.ఈకార్యక్రమంలో యంసిపిఐ(యు),ఎ.ఐ.ఎఫ్.డి.ఎస్,పిడిఎస్యు, ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

PRATHAP, BELLAMPALLI

PRATHAP, BELLAMPALLI

Next Story