Gudihatnur: వైన్ షాప్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు వినతి!
Gudihatnur: గుడిహత్నూర్ - మచ్చపూర్ మార్గంలోని వైన్ షాపుల వల్ల మహిళలు, రైతులకు కలుగుతున్న ఇబ్బట్లపై కలెక్టర్ రాజర్షి షాకు సర్పంచ్ రాథోడ్ ప్రతాప్ వినతి.
Gudihatnur: వైన్ షాప్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు వినతి!
Gudihatnur: గుడిహత్నూర్ మండల కేంద్రం నుంచి మచ్చపూర్ గ్రామానికి వెళ్లే దారిలో ఉన్న రెండు వైన్ షాపుల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని మచ్చపూర్ గ్రామ సర్పంచ్ రాథోడ్ ప్రతాప్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా కు వినతి పత్రం సమర్పించారు.
ఈ మార్గంలో వైన్ షాపులు ఉండటం వల్ల రాకపోకలు సాగించే గిరిజన మహిళలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మద్యం ప్రియులు బహిరంగంగా రోడ్డు పక్కనే మలమూత్ర విసర్జన చేస్తుండటంతో ఆ దారిన వెళ్లే మహిళలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని పేర్కొన్నారు.
అంతేకాకుండా మద్యం తాగిన వారు ఖాళీ మద్యం సీసాలను రోడ్డు పక్కనే పడేయడంతో అవి పక్కనే ఉన్న వ్యవసాయ చేన్లలో పడుతున్నాయని, దీంతో రైతులకు, వ్యవసాయ కూలీలకు తీవ్ర నష్టం, ప్రమాదం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వైన్స్ యజమానులు కనీసం ఇవేవీ పట్టనట్లు ఉంటున్నారని, పరిసర ప్రాంతాల్లో ప్రజలకు, మహిళలకు తీవ్ర ఇబ్బందిగా మారిన సదరు వైన్ షాపు యజమానులపై తగిన చర్యలు తీసుకోవాలని సర్పంచ్ ప్రతాప్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.




