Nirmal: ఘనంగా మహారాణా ప్రతాప్ జయంతి వేడుకలు నిర్వహణ

Nirmal: బతుకమ్మ ఘాట్ వద్ద రాజ్‌పుత్ సంఘం ఆధ్వర్యంలో మహారాణా ప్రతాప్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 9 May 2026 12:18 PM IST
Nirmal
X

Nirmal

Nirmal: తన రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం మొఘులలతో పోరాడిన గొప్ప వీరుడు మహారాణా ప్రతాప్ సింగ్ అని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి పేర్కొన్నారు. నిర్మల్లోని బతుకమ్మ ఘాట్ వద్ద రాజ్ పుత్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మహారాణా ప్రతాప్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహారాణా ప్రతాప్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ తన రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం మహారాణా ప్రతాప్ చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోయిందన్నారు. మహారాణా ప్రతాప్ చేసిన యుద్ధాల్లో హల్దీఘాట్ యుద్ధం చాలా ప్రాస్త్యం పొందిందని, కేవలం 20 వేల మంది సైనికులతో రెండు లక్షల మందిని ఓడించి తన రాజ్యాన్ని కాపాడుకున్నాడన్నారు. ఇలాంటి వీరుల గాధలు పాఠ్యపుస్తకాల్లో చేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. మహారాణా ప్రతాప్ ను స్ఫూర్తిగా తీసుకొని యువత హిందూ హిందూ ధర్మ పరిరక్షణ, దేశ రక్షణకు పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గోపు గోపి, కత్తి నరేందర్, నాందేడపు చిన్ను, రాజ్పుత్ అధ్యక్ష కార్యదర్శులు గజేందర్ సింగ్, ప్రవీణ్ సింగ్, సంఘ బాధ్యులు సాయి సింగ్, లక్ష్మణ్ సింగ్, చందు లాల్ సింగ్, నారాయణ సింగ్, ఆనంద్ సింగ్, అనిల్ సింగ్, ఠాగూర్ సాయి సింగ్, పింటూ, రజ్జు సింగ్, తదితరులు పాల్గొన్నారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL

Next Story