Khanapur: టీయూడబ్ల్యూజే–ఐజేయూ నిర్మల్ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి!
Khanapur: డిసెంబర్ 1న నిర్మల్‌లో నిర్వహించనున్న టీయూడబ్ల్యూజే–ఐజేయూ జిల్లా తృతీయ మహాసభలను జయప్రదం చేయాలని ఐజేయూ నేత గాండ్ల రాజశేఖర్ పిలుపునిచ్చారు.
Khanapur: టీయూడబ్ల్యూజే–ఐజేయూ నిర్మల్ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి!
నిర్మల్ జిల్లా: ఖానాపూర్ పట్టణంలోని విశ్రాంతి భవనంలో యూనియన్ నాయకులు మహాసభల పోస్టర్లను విడుదల చేశారు. ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యుడు గాండ్ల రాజశేఖర్ మాట్లాడుతూ... నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్.కె కన్వెన్షన్ హాల్లో డిసెంబర్ 1వ తేదీన నిర్వహించనున్న టీయూడబ్ల్యూజే–ఐజేయూ నిర్మల్ జిల్లా తృతీయ మహాసభలను జయప్రదం చేయాలని అని అన్నారు.
జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం, జర్నలిస్టుల ఐక్యత కోసం ఈ మహాసభలు నిర్వహిస్తున్నామని అన్నారు. జిల్లాలోని అన్ని మండలాల నుండి జర్నలిస్టులు పెద్ద ఎత్తున తరలి వచ్చి మహాసభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. జర్నలిస్టులకు అక్రిడిటేషన్, హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు, పెన్షన్ వంటి సమస్యలపై ఈ మహాసభలో చర్చించి, ప్రభుత్వానికి వినతి పత్రం అందజేస్తామని తెలిపారు.
ఈ మహాసభకు జిల్లాలోని ప్రింట్, ఎలక్ట్రానిక్,మీడియా జర్నలిస్టులందరూ హాజరు కావాలని కోరారు.




