Adilabad: పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా చంద్రకాంత్ ప్రమాణ స్వీకారం

Adilabad: ఆదిలాబాద్ పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా మల్లూర్ వార్ చంద్రకాంత్ ప్రమాణ స్వీకారం చేశారు. వైశ్యుల అభ్యున్నతికి కృషి చేస్తానన్నారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 9 Aug 2026 1:23 PM IST
Adilabad
X

Adilabad: పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా చంద్రకాంత్ ప్రమాణ స్వీకారం

Adilabad సామాజిక సేవే లక్ష్యంగా ఆర్య వైశ్యుల అభ్యున్నతికి పాటు పడతామని ఆదిలాబాద్ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మల్లూర్ వార్ చంద్రకాంత్ అన్నారు. పట్టణంలోని సెంట్రల్ గార్డెన్ లో ఆదివారం నూతనంగా ఎన్నికైన పాలక వర్గ ప్రమాణ స్వీకారోత్సవం కులస్తుల జయ జయ ద్వానాల నడుమ ఘనంగా నిర్వహించారు. జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు చింతావార్ రాజేశ్వర్ అధ్యక్షతన జరిగిన వేడుకకు ప్రముఖ పారిశ్రామిక వేత్త, జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజు చింతావార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత కుల దైవం వాసవి మాత కు పూజలు చేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ఆరంభించారు. ముఖ్య అతిథుల సమక్షంలో పాలక వర్గ సభ్యులతో ప్రమాణం చేయించారు. ప్రధాన కార్యదర్శిగా ప్రవీణ్ మహాజన్, కోశాధికారులుగా గందే రవి కుమార్, గురు ప్రకాష్, కార్యదర్శులుగా జనగం దినకర్, దెబ్బడి రాకేష్ లతో పాటు మరో 50 మంది కార్య వర్గ సభ్యులు ప్రమాణం చేశారు.

ఈ సందర్భంగా అధ్యక్షుడు మల్లూర్ వార్ చంద్రకాంత్ మాట్లాడుతూ వైశ్యుల కీర్తిని ఇనుమడింప జేసేలా ..నిరుపేద వైశ్య కుటుంబాలకు అండగా ఉంటూ పాలన సాగిస్తానని అన్నారు. ప్రభుత్వ పరంగా వారికి అందాల్సిన ప్రయోజనాల కోసం కృషి చేస్తానన్నారు. తనకు అండగానిలిచి విజయాన్ని అందించిన కులస్తులకు ధన్యవాదాలు తెలియజేశారు. మున్సిపల్ ఛైర్పర్సన్ బండారి అనూష మాట్లాడుతూ ఆర్య వైశ్యులు ఐక్యతగా ఉంటూ అభివృద్ధి పథంలో పాయనించాలని ఆకాంక్షించారు. నూతన కార్యవర్గం కులస్తులకు అండగా ఉందాలన్నారు. కులస్తులకు ఇచ్చిన హామీ మేరకు పట్టణంలో కూడలి సుందరీ కరణకు తన వంతు సహకారం అందిష్టాన్నన్నారు. అలాగే భవిష్యత్తులో ఇలాంటి సహాయం అవస రమైన తన పరిధిలో నెరవేర్చడానికి ముందుంటానని హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు బూసం రాజేశ్వర్, కౌటిక్ రాజు, పడిగెల రాజేష్, దిలీప్, నితీన్, కోటగిరి రాకేష్, వొజ్జల ప్రకాష్, సంతోష్, భార్గవి, రాగిణీ, తదితరులు పాల్గొన్నారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story