Mancherial: సింగరేణి చరిత్ర: జైపూర్ ప్లాంట్‌కు తొలి నైనీ బొగ్గు రైలు!

Mancherial: ఒడిశా నైనీ బ్లాక్ నుంచి 4,000 టన్నుల బొగ్గుతో వచ్చిన తొలి రైలు జైపూర్ థర్మల్ ప్లాంట్‌కు చేరుకుంది. అధికారులు పూజలు చేసి స్వాగతం పలికారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 6 Aug 2026 10:51 AM IST
Mancherial
X

Mancherial: సింగరేణి చరిత్ర: జైపూర్ ప్లాంట్‌కు తొలి నైనీ బొగ్గు రైలు!

మంచిర్యాల జిల్లా

నైనీ బొగ్గుతో చరిత్ర సృష్టించిన సింగరేణి.. జైపూర్ థర్మల్ ప్లాంట్‌కు తొలి రైలు..

మంచిర్యాల, ఆగస్టు 6: సింగరేణి సంస్థ మరో చారిత్రక మైలురాయిని అధిగమించింది. ఒడిశా రాష్ట్రంలోని అంగుల్ జిల్లా నైనీ సింగరేణి బొగ్గు బ్లాక్ నుంచి తొలిసారిగా బొగ్గును తన మాతృ సంస్థకు తరలిస్తూ కొత్త చరిత్రను సృష్టించింది. నైనీ గనుల నుంచి బయలుదేరిన తొలి గూడ్స్ రైలు సుమారు 1,131 కిలోమీటర్లు ప్రయాణించి 4,000 టన్నుల బొగ్గుతో మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని **సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ (STPP) కు చేరుకుంది.

ఈ సందర్భంగా థర్మల్ పవర్ ప్లాంట్‌లో బొగ్గుతో వచ్చిన తొలి రైలుకు సింగరేణి అధికారులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. సింగరేణి డైరెక్టర్ (ఆపరేషన్స్) సూర్యనారాయణ, డైరెక్టర్ తిరుమలరావు ముఖ్య అతిథులుగా హాజరై జెండా ఊపి తొలి బొగ్గు రైలును ప్రారంభించారు.

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర విద్యుత్ అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ "మన సింగరేణి బొగ్గు – మన రాష్ట్రానికే" అనే లక్ష్యంతో నైనీ బ్లాక్ నుంచి బొగ్గు సరఫరా ప్రక్రియను ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఈ చర్యతో రాష్ట్ర థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు సరఫరాలో సింగరేణి స్వయం సమృద్ధి దిశగా మరో కీలక అడుగు వేసిందన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు, ఉద్యోగులు, కార్మికులు, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.

Next Story