Mancherial: యువతకు అంతర్జాతీయ ప్రమాణాలతో నైపుణ్య శిక్షణ మంత్రి వివేక్!
Mancherial: తెలంగాణ యువతకు అంతర్జాతీయ ప్రమాణాలతో నైపుణ్య శిక్షణ అందిస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి వెల్లడి; భువనేశ్వర్ వరల్డ్ స్కిల్ సెంటర్ పరిశీలన.
Mancherial: యువతకు అంతర్జాతీయ ప్రమాణాలతో నైపుణ్య శిక్షణ మంత్రి వివేక్!
Mancherial: తెలంగాణ యువతకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నైపుణ్య శిక్షణ అందించి, దేశ, విదేశాల్లో మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఉన్న *వరల్డ్ స్కిల్ సెంటర్ (WSC)*ను తెలంగాణ ప్రతినిధి బృందంతో కలిసి మంత్రి సందర్శించారు.
ఈ సందర్భంగా వరల్డ్ స్కిల్ సెంటర్‌లో అమలు చేస్తున్న అంతర్జాతీయ ప్రమాణాల ఫినిషింగ్ స్కూల్ విధానం, అధునాతన శిక్షణా ప్రయోగశాలలు, విదేశీ ఉపాధికి అవసరమైన సాంకేతిక నైపుణ్యాలు, భాషా శిక్షణ, సాఫ్ట్ స్కిల్స్ అభివృద్ధి విధానాలను పరిశీలించారు.
సింగపూర్ ITE నమూనాలో, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB), సింగపూర్ ITEES భాగస్వామ్యంతో పనిచేస్తున్న ఈ కేంద్రంలో మెకాట్రానిక్స్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, ఎలక్ట్రికల్ టెక్నాలజీ, ప్రెసిషన్ ఇంజినీరింగ్, ఎయిర్ కండిషనింగ్ అండ్ రిఫ్రిజరేషన్ తదితర రంగాల్లో అందిస్తున్న అధునాతన శిక్షణా విధానాలను మంత్రి అధ్యయనం చేశారు.
అనంతరం ఒడిశా స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ శాఖ కమిషనర్ భూపేంద్ర సింగ్ పూనియా, వరల్డ్ స్కిల్ సెంటర్ సీఈఓ రష్మి రంజన్ మహాపాత్రతో తెలంగాణ అధికారుల బృందం సమావేశమై పలు అంశాలపై చర్చించారు..
తెలంగాణలో ‘ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్’, ‘వరల్డ్‌స్కిల్స్’ పోటీలకు యువతను సన్నద్ధం చేయడం, అంతర్జాతీయ ఉపాధి అవకాశాలకు అనుగుణంగా సాంకేతిక శిక్షణతో పాటు విదేశీ భాషలు, అంతర్జాతీయ వాణిజ్య ప్రమాణాలు, కమ్యూనికేషన్, సాఫ్ట్ స్కిల్స్‌ను అనుసంధానం చేసే అంశాలపై ప్రత్యేకంగా చర్చించినట్లు మంత్రి తెలిపారు.
తెలంగాణ యువతను ప్రపంచస్థాయి ఉద్యోగ అవకాశాలకు సిద్ధం చేసేలా రాష్ట్రంలో నైపుణ్య శిక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే తమ లక్ష్యమని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు.




