Nirmal: ఖానాపూర్లో ఘనంగా పోలీసుల భారీ బైక్ ర్యాలీ!
Nirmal: నిర్మల్ జిల్లా ఖానాపూర్లో పోలీసు ఫ్లాగ్ డే వారోత్సవాల్లో భాగంగా సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి హెల్మెట్ అవగాహన కల్పించారు.
Nirmal: ఖానాపూర్లో ఘనంగా పోలీసుల భారీ బైక్ ర్యాలీ!
Nirmal: నిర్మల్ జిల్లా ఖానాపూర్లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పోలీసు ఫ్లాగ్ డే వారోత్సవాల్లో భాగంగా జరిగిన ఈ ర్యాలీని ఖానాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు.
శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులను స్మరిస్తూ.. ప్రతి సంవత్సరం అక్టోబర్ 21 నుంచి 31 వరకు పోలీసు ఫ్లాగ్ డే వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా "నిర్మల్ పోలీస్...మీ పోలీస్" అనే నినాదంతో ఖానాపూర్ పోలీస్ స్టేషన్ నుండి కొమురం భీం చౌరస్తా వరకు ఈ భారీ బైక్ ర్యాలీ కొనసాగింది.
పోలీసులు విధి నిర్వహణలో చేసే త్యాగాలను ప్రజలకు వివరించడంతో పాటు.. ప్రజల రక్షణ కోసం పోలీస్ శాఖ అందిస్తున్న సేవలపై ఈ సందర్భంగా అవగాహన కల్పించారు. ప్రజలు-పోలీసుల మధ్య సత్సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగింది.
రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం తేవడమే ప్రధాన ధ్యేయంగా.. ఈ ర్యాలీలో పాల్గొన్న ఖానాపూర్ సర్కిల్ పోలీసు అధికారులు, సిబ్బంది అందరూ తప్పనిసరిగా హెల్మెట్లు ధరించి వాహనాలు నడిపారు. ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని అధికారులు ప్రజలకు సందేశం ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఖానాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణతో పాటు, ఎస్ఐలు రాహుల్, సాయి కుమార్, సాయి కిరణ్, హనుమాండ్లు మరియు ఖానాపూర్, కడెం, పెంబి, దస్తురాబాద్ పోలీస్ స్టేషన్ల సిబ్బంది, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.




