Adilabad: కన్గుట్టలో అగ్నిప్రమాదం.. కళ్లముందే బూడిదైన రైతన్న కష్టం
Adilabad: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని కన్గుట్టలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సుమారు 100 ఎకరాల్లో మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైంది.
Adilabad: కన్గుట్టలో అగ్నిప్రమాదం.. కళ్లముందే బూడిదైన రైతన్న కష్టం
Adilabad: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో పెను విషాదం చోటుచేసుకుంది. మండలంలోని కన్గుట్ట గ్రామంలో మొక్కజొన్న చేలల్లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గాలి వేగానికి మంటలు ఒక చేను నుండి మరొక చేనుకు అతి వేగంగా వ్యాపిస్తుండటంతో రైతులు వాటిని అదుపు చేయలేక నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు.
ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం సుమారు 100 ఎకరాలకు పైగా మొక్కజొన్న పంట పూర్తిగా అగ్గిపాలై బూడిదయ్యింది. ప్రస్తుతం మంటలు బోథ్ మరియు సాకెరా గ్రామ శివార్ల వైపు వేగంగా విస్తరిస్తుండటంతో అదుపు చేయడం కష్టతరంగా మారింది. చేతికొచ్చిన పంట కళ్లముందే కాలిపోతుండటంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Next Story




