Nirmal: భైంసా రైస్‌ మిల్లులో 5,825 మెట్రిక్ టన్నుల ధాన్యం గోల్‌మాల్!

Nirmal: భైంసా పల్లవి రైస్ మిల్లులో భారీగా ధాన్యం గోల్‌మాల్ 5,825 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయం ఆకస్మిక తనిఖీల్లో గుట్టురట్టు పరారీలో మిల్లర్, క్రిమినల్ కేసుకు రంగం సిద్ధం.

Srinivas, Mondol Bhainsa
Published on: 3 Oct 2026 9:34 PM IST
Nirmal
X

Nirmal: భైంసా రైస్‌ మిల్లులో 5,825 మెట్రిక్ టన్నుల ధాన్యం గోల్‌మాల్!

నిర్మల్: నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని వానల్‌పాడ్ గ్రామంలోని పల్లవి మోడర్న్‌ రైస్‌ మిల్లులో రెవెన్యూ, పౌరసరఫరాలు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ కేటాయింపులు, రికార్డుల్లోని నిల్వలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మిల్లుకు కేటాయించిన 6,102.08 మెట్రిక్‌ టన్నుల ధాన్యంలో, లెక్కల ప్రకారం 5,904.435 మెట్రిక్‌ టన్నులు నిల్వ ఉండాల్సి ఉంది. అయితే తనిఖీల్లో కేవలం 79.44 మెట్రిక్‌ టన్నుల ధాన్యం మాత్రమే లభ్యమైంది.

దీంతో 5,824.995 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొరత ఉన్నట్లు అధికారులు గుర్తించారు.భారీ వ్యత్యాసం నేపథ్యంలో అధికారులు పంచనామా నిర్వహించి వివరాలు నమోదు చేశారు. దీనిపై సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించడంతో పాటు బాధ్యులైన మిల్లర్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేసేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.

తనిఖీల సమయంలో రైస్‌ మిల్లర్‌ అందుబాటులో లేకపోవడంతో పరారీలో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ ధాన్యం పక్కదారి పట్టించిన అంశంపై నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Srinivas, Mondol Bhainsa

Srinivas, Mondol Bhainsa