బాసర సరస్వతీ క్షేత్రంలో మంత్రి జూపల్లి.. గోదావరి పుష్కర ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష!

బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారిని మంత్రి జూపల్లి కృష్ణారావు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 28 Jun 2026 12:23 PM IST
బాసర సరస్వతీ క్షేత్రంలో మంత్రి జూపల్లి.. గోదావరి పుష్కర ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష!
X

బాసర సరస్వతీ క్షేత్రంలో మంత్రి జూపల్లి.. గోదావరి పుష్కర ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష!

బాసర: బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారిని మంత్రి జూపల్లి కృష్ణారావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.. మొదట ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ అధికారులు, అర్చకులు మంగళవాయిద్యాలు, పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.

అనంతరం ఇటీవల చోరీ జరిగిన మహంకాళి అమ్మవారి ఆలయాన్ని మంత్రి సందర్శించి ఘటనపై ఆరా తీశారు. ఆలయ భద్రతా ఏర్పాట్లపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గోదావరి పుష్కర ఏర్పాట్లపై బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులు, టెండర్ల ప్రక్రియ పురోగతిపై జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఎస్పీ జానకి, ఆలయ ఈవో అంజనాదేవితో మంత్రి సమీక్ష నిర్వహించారు. టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story