Nirmal: నిర్మల్‌లో మంత్రులు జూపల్లి, పొంగులేటి పర్యటన..అభివృద్ధి పనుల ప్రారంభం!
Nirmal: నిర్మల్‌లో రూ.23.35 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. ఇందిరమ్మ ఇండ్లపై సమీక్ష.
Nirmal: నిర్మల్‌లో మంత్రులు జూపల్లి, పొంగులేటి పర్యటన..అభివృద్ధి పనుల ప్రారంభం!
Nirmal: నిర్మల్ లోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్లు, రెవెన్యూ అంశాలపై సమీక్ష నిర్వహించేందుకు మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిర్మల్ జిల్లా కు చేరుకున్నారు. నిర్మల్ లోని సమీకృత కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న మంత్రులకు కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఎస్పీ జానకి షర్మిల, ఎమ్మెల్యే బొజ్జు పటేల్ లు పుష్పగుచ్చారు అందజేసి స్వాగతం పలికారు.
అనంతరం పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో నిర్మల్ జిల్లాలో సుమారు రూ.23.35 కోట్ల తో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. నూతనంగా నిర్మించనున్న జిల్లాలోని మూడు మండలాల తహసీల్దార్ భవనాలతో పాటు, ఖానాపూర్ సబ్ రిజిస్టర్ కార్యాలయ నూతన భవనానికి, 6 ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల భవనాలకు శంకుస్థాపనలు చేశారు. 2027 లో జరగనున్న గోదావరి పుష్కరాలకు సంబంధించి ప్రత్యేక పుష్కర ఘాట్లకు శంకుస్థాపన చేశారు.
అనంతరం కలెక్టరేట్లోని సమీక్ష సమావేశ మందిరంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్లు, రెవెన్యూ అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు జాదవ్ అనిల్, వెడ్మ బొజ్జు పటేల్, రామారావు పటేల్ తో పాటు ఎమ్మెల్సీ దండేవిటల్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల కలెక్టర్లు, ఆయా శాఖల ఉన్నతాధికారులు, అధికారులు పాల్గొన్నారు. మంత్రుల పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.




