Gudihatnur: మైనర్ వివాహం, కిడ్నాప్ కేసులో ఇద్దరి రిమాండ్!

Gudihatnur: గుడిహత్నూర్ మండలంలో మైనర్ బాలిక బాల్యవివాహం మరియు కిడ్నాప్ కేసులో ఇద్దరిని రిమాండ్‌కు తరలించారు.

NAGULA SATISH, BOATH
Published on: 1 Aug 2026 8:15 AM IST
Gudihatnur
X

Gudihatnur: మైనర్ వివాహం, కిడ్నాప్ కేసులో ఇద్దరి రిమాండ్!

Gudihatnur: ఇంద్రవెల్లికి చెందిన మైనర్ బాలికకు కొల్హరీ గ్రామానికి చెందిన రాథోడ్ రూప్ సింగ్‌తో మూడు నెలల క్రితం బాల్యవివాహం జరిగింది. అయితే, ఈ నెల 25న తన భార్య కనిపించడం లేదంటూ రూప్ సింగ్ గుడిహత్నూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదైంది.

ఉట్నూర్ ఎఎస్పీ రుత్విక్ సాయి ఆధ్వర్యంలో గుడిహత్నూర్ ఎస్సై శ్రీకాంత్, పోలీసు సిబ్బంది చేపట్టిన దర్యాప్తులో ఆ బాలిక కొల్హరీ గ్రామనికి చెందిన రాథోడ్ గుణవంత్ రావ్‌తో హైదరాబాద్ వెళ్లిపోయినట్లు తేలింది. వీరిద్దరినీ పట్టుకున్న పోలీసులు.. బాలిక మైనర్ కావడంతో రూప్ సింగ్‌పై పోక్సో, బాల్యవివాహ నిరోధక చట్టం కింద, ప్రేమ పేరుతో అపహరించిన గుణవంత్ రావ్‌పై కిడ్నాప్ కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

చట్టవిరుద్ధంగా బాల్యవివాహం జరిపించినందుకు ఇరు కుటుంబాల సభ్యులపైనా కేసులు నమోదు చేసినట్లు ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే తెలిపారు.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH

Next Story