Boath: బోథ్ మైనార్టీ సమస్యలపై సచివాలయంలో మంత్రి జూపల్లి సమీక్ష

Boath: తెలంగాణ సచివాలయంలో బోథ్ నియోజకవర్గ మైనార్టీల సమస్యలపై మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక సమీక్ష నిర్వహించారు.

NAGULA SATISH, BOATH
Published on: 19 May 2026 9:11 AM IST
Boath
X

Boath: బోథ్ మైనార్టీ సమస్యలపై సచివాలయంలో మంత్రి జూపల్లి సమీక్ష

బోథ్: హైదరాబాద్‌లోని తెలంగాణ సచివాలయంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, TMREIS చైర్మన్ ఫహీం ఖురేషి ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్, మైనారిటీ బృందంతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇచ్చోడ, బోథ్, నేరడిగొండ, గుడిహత్నూర్ మండలాల్లో నూతన షాదీఖానాల మంజూరు, బోథ్ షాదీఖానా అభివృద్ధి, విద్యాసంస్థల్లో మౌలిక వసతులు, ఈద్గా, ఖబ్రస్తాన్‌ల పనులు మరియు ఇందిరమ్మ ఇళ్లలో మైనారిటీలకు ప్రత్యేక కోటా కల్పించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు, మైనార్టీ వెల్ఫేర్ సెక్రటరీ షఫీఉల్లాకు వినతిపత్రం సమర్పించారు.

ఈ సమస్యలపై సానుకూలంగా స్పందించిన మంత్రి జూపల్లి కృష్ణారావు, వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అర్హులైన ప్రతి మైనారిటీ కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు నాయకులు పేర్కొన్నారు.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH

Next Story