Adilabad: రేషన్ షాపుల్లో జొన్నలు? అదిలాబాద్ రైతుల కోసం ఎమ్మెల్యే అనిల్

Adilabad: తాంసి మార్కెట్ యార్డులో తెల్ల జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్.

ANNOJULA SRINIVAS  RAO
Published on: 9 May 2026 4:43 PM IST
Adilabad
X

Adilabad: రేషన్ షాపుల్లో జొన్నలు? అదిలాబాద్ రైతుల కోసం ఎమ్మెల్యే అనిల్

ఆదిలాబాద్: తాంసి మార్కెట్ యార్డులో జొన్నల కొనుగోళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అదిలాబాద్ జిల్లా తాంసి మార్కెట్ యార్డులో తెల్ల జొన్నల కొనుగోలు కేంద్రాన్ని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రారంభించగా కార్యక్రమంలో ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా అనిల్ జాదవ్ మాట్లాడుతూ రైతులు పండించిన జొన్న పంట పూర్తిస్థాయిలో కొనుగోళ్లు జరిపే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు అనిల్.

ఎకరాకు 15 క్వింటాళ్లు కొనుగోలు పరిమితి పెంచాలని రైతుల నుంచి డిమాండ్ ఉందని, ప్రస్తుతం 10 క్వింటాళ్ల పరిమితి నేపథ్యంలో రైతుల డిమాండ్ 15 కుంటల వరకు పరిమితి పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవిస్తామని అన్నారు.చాలా మార్కెట్ యార్డుల్లో గన్ని బ్యాగుల కొరత, గోదాంల కొరత కారణంగా కొనుగోలు ఆలస్యం అవుతున్నాయని దీనిపై ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు ఎమ్మెల్యే, మార్కెట్ కమిటీ చైర్మన్.

పంట కొనుగోళ్లలో జరుగుతున్న ఇబ్బందులపై ఎప్పటికప్పుడు మంత్రులు, అధికారులతో చర్చలు జరుపుతున్నానని తెలిపారు.ప్రభుత్వం ఎకరాకు 10 క్వింటాళ్ల వరకు మాత్రమే కొనుగోలు చేస్తుందని, 15 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేసేలా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావులతో మాట్లాడడం జరిగిందని తెలిపారు.

అలాగే రేషన్ దుకాణాల్లో జొన్నలు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విన్నవించటం జరిగిందని, అదే జరిగితే జిల్లాలో జొన్న పండించే రైతులకు మేలు జరుగుతుందని అన్నారు. షెడ్యూల్ ప్రకారం జొన్నలను మార్కెట్ యార్డుకు తీసుకురావాలని రైతులకు సూచించారు..ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తన్వీర్ అహ్మద్ పటేల్.

ANNOJULA SRINIVAS  RAO

ANNOJULA SRINIVAS RAO

Next Story