Komaram Bheem: రూ. 2400 మద్దతు ధర రైతులకు బాసటగా నిలిచిన సిర్పూర్ ఎమ్మెల్యే

Komaram Bheem: కొమరం భీమ్ జిల్లా కాగజ్ నగర్‌లో మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు.

LALITH KUMAR, SIRPUR
Published on: 20 April 2026 2:03 PM IST
Komaram Bheem
X

Komaram Bheem: రూ. 2400 మద్దతు ధర రైతులకు బాసటగా నిలిచిన సిర్పూర్ ఎమ్మెల్యే

Kumuram Bheem: కొమరం భీమ్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని బీట్ మార్కెట్లో మార్క్ ఫెడ్ మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మక్కలు పండించిన రైతుల కోరిక మేరకు, వారికి పూర్తి మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మరియు ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణ రావుల గారితో మాట్లాడి సిర్పూర్ నియోజకవర్గంలో రెండు మక్కల కొనుగోలు కేంద్రాలు మంజూరు చేయించడం జరిగిందని తెలిపారు. ఒక మక్కల కొనుగోలు కేంద్రాన్ని కాగజ్ నగర్లో ప్రారంభించడం జరిగిందని, రెండో మక్కల కొనుగోలు కేంద్రం కౌటాలలో ప్రారంభిస్తామని తెలిపారు. రైతులు దళారులకు తక్కువ రేటుకు మక్కలు అమ్ముకోకుండా, రూ.2400 మద్దతు ధర పొందవచ్చునని చెప్పారు. ఈ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

LALITH KUMAR, SIRPUR

LALITH KUMAR, SIRPUR

Next Story