Mancherial: మూడు నెలల్లో అర్హులకు ఇళ్ల కేటాయింపు.. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

Mancherial: మంచిర్యాల రాజీవ్ నగర్‌లోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అధికారులతో కలిసి పరిశీలించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 10 May 2026 5:44 PM IST
Mancherial
X

Mancherial: మూడు నెలల్లో అర్హులకు ఇళ్ల కేటాయింపు.. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

మంచిర్యాల: మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రాజీవ్ నగర్ డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పరిశీలించారు. హౌసింగ్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి కాలనీలో పర్యటించిన ఆయన, గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లకు తాగునీరు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు లేకపోవడం మంత్రి దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సానుకూలంగా స్పందించి అన్ని వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. మరో మూడు నెలల్లో లక్కీ డ్రా విధానంలో అర్హులైన లబ్ధిదారులకు ఇండ్లు కేటాయిస్తామని వెల్లడించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల పేరుతో ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హెచ్చరించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story