Nirmal: ఐబీఆర్ అచీవర్ నలం నిధ్యానకు ఎమ్మెల్యే ఏలేటి అభినందనలు!
Nirmal: ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ (IBR) అచీవర్‌గా గుర్తింపు పొందిన నిర్మల్ చిన్నారి నలం నిధ్యానను ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సోమవారం సత్కరించారు.
Nirmal: ఐబీఆర్ అచీవర్ నలం నిధ్యానకు ఎమ్మెల్యే ఏలేటి అభినందనలు!
నిర్మల్: నిర్మల్‌కు చెందిన చిన్నారి నలం నిధ్యాన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ (IBR)లో చోటు సంపాదించి 'ఐబీఆర్ అచీవర్' బిరుదు పొందిన సందర్భంగా బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని ఆయన నివాస గృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి చిన్నారి నిధ్యానను ప్రత్యేకంగా అభినందించి, శాలువాతో సత్కరించారు. కేవలం 5 సంవత్సరాల 1 నెల వయస్సులోనే రెండు చేతులతో విడివిడిగా ఇంగ్లీష్ అక్షరాలు (పెద్ద, చిన్న అక్షరాలు), తెలుగు అచ్చులు, హిందీ అచ్చులు, 1 నుంచి 10 వరకు సంఖ్యలను కేవలం 10 నిమిషాల్లో రాసి తన అసాధారణ ప్రతిభను చాటుకుంది.
చిన్న వయస్సులోనే ఇంతటి ప్రతిభను కనబరిచి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో గుర్తింపు పొందడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి తల్లిదండ్రులకు, నిర్మల్ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ చిన్నారి నిధ్యానకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్, జమాల్ తదితరులు పాల్గొన్నారు.




