Nirmal: నిర్మల్ గాజులపేటలో రేణుక ఎల్లమ్మ ఆలయానికి భూమిపూజ!
Nirmal: నిర్మల్ గాజులపేటలో రూ.12 లక్షలతో రేణుక ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి.
Nirmal: నిర్మల్ గాజులపేటలో రేణుక ఎల్లమ్మ ఆలయానికి భూమిపూజ!
నిర్మల్: నిర్మల్ పట్టణంలోని గాజులపేటలో రేణుక ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.12 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఆలయానికి కొబ్బరికాయ కొట్టి శాస్త్రోక్తంగా శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




