Adilabad: అదిలాబాద్‌లో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సైకిల్ రైడ్!

Adilabad: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ వినూత్నంగా స్పందించారు.

ANNOJULA SRINIVAS  RAO
Published on: 16 May 2026 12:07 PM IST
Adilabad
X

Adilabad: అదిలాబాద్‌లో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సైకిల్ రైడ్!

అదిలాబాద్: ఇంధన పొదుపు పై పీఎం నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుమేరకు అదిలాబాద్ బిజెపి ఎమ్మెల్యే పాయల శంకర్ కాలనీల విజిట్ కోసం జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానందంతో కలిసి సైకిల్ పై వెళ్లారు.. ప్రతిరోజు వాడి వార్డుల విజిట్ కోసం వీలైనంతవరకు వాహనాన్ని వాడకుండా సైకిల్ పైన వెళ్తానని, ప్రతి ఒక్కరూ ఇంధన పొదుపు చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు శంకర్.

పశ్చిమ ఆసియా యుద్ధం ప్రభావం అన్ని వర్గాల ప్రజలపై చూపుతోందని, యుద్ధం ప్రభావం ఎల్పిజి గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడబోతుందని ఇందుకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా పెట్రోల్, డీజిల్ పొదుపు పాటించాలని పిలుపునిచ్చారు.. స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి వార్డ్ కౌన్సిలర్లతో కలిసి ఇందిరా ప్రియదర్శిని స్టేడియం మార్గం మీదుగా కొత్త కుమ్మరి వాడా వరకు సైకిల్ ని నడుపుకుంటూ స్వయంగా వెళ్లారు... ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు జ్యోతి, జోగు రవి, మనోజ్ పవర్, నాయకులు రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

ANNOJULA SRINIVAS  RAO

ANNOJULA SRINIVAS RAO

Next Story