Adilabad: రిమ్స్ ఆసుపత్రిలో ఎమ్మెల్యే తనిఖీ.. మంత్రితో ఫోన్ లో చర్చ!

Adilabad: ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిటీ స్కాన్, వైద్యుల కొరతపై నేరుగా ఆరోగ్య శాఖ మంత్రితో ఫోన్ లో మాట్లాడారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 25 Jun 2026 3:53 PM IST
Adilabad
X

Adilabad: రిమ్స్ ఆసుపత్రిలో ఎమ్మెల్యే తనిఖీ.. మంత్రితో ఫోన్ లో చర్చ!

ఆదిలాబాద్: రిమ్స్ ఆస్పత్రిని గురువారం ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలపై ఆరా తీశారు. ఆస్పత్రిలోని సమస్యలపై రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అప్పటికి అప్పుడు ఫోన్ చేసి ఆయన దృష్టికి ఎమ్మెల్యే తీసుకెళ్లారు.

ఆస్పత్రిలో సిటీ స్కానింగ్, వైద్యుల కొత్త గురించి తెలియజేశారు. ఒకసారి రిమ్స్ ఆస్పత్రిని సందర్శించాలని ఎమ్మెల్యే కోరారు.. ఈ విషయమై మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రిమ్స్ ఆస్పత్రిని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి నిర్మించి ఇచ్చినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం సిటి స్కాన్, రేడియాలజీ విభాగాలలో సిబ్బందిని నియమించడం లేదన్నారు. గత 15 రోజుల నుండి సిటీ స్కాన్ పని చేయకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం రిమ్స్ ను అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. ఆస్పత్రిలో బాత్రూంలో సైతం అస్తవ్యస్తంగా ఉన్నాయని అన్నారు. ఆస్పత్రిలో సరిపడా సిబ్బంది లేరని, ఏదైనా రిపేరు వస్తే పట్టించుకునే నాథుడే లేరన్నారు. రిమ్స్ లో అధ్వానమైన పరిస్థితి నెలకొందని ఆరోపించారు. రిమ్స్ ఆస్పత్రి పై ఆరోగ్యశాఖ మంత్రి వెంటనే సమీక్ష చేపట్టి ఇక్కడి నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టల్ వెంటనే నియమించాలన్నారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story