Adilabad: అపోహలు వద్దు.. బోగస్ ఓట్ల తొలగింపునకే

Adilabad: సమగ్ర ఓటర్ల జాబితా ఎలాంటి అపోహలకు గురికావద్దని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్.కేవలం బోగస్ ఓట్లను తొలగించడానికే ఈ సర్వే ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 26 Jun 2026 4:16 PM IST
Adilabad
X

Adilabad: అపోహలు వద్దు.. బోగస్ ఓట్ల తొలగింపునకే

Adilabad: సమగ్ర ఓటర్ల జాబిత ప్రక్రియ కోసం చేపడుతున్న ఎస్ఐఆర్ పై ప్రజలకు ఎలాంటి అపోహలకు గురి కావద్దని.. కేవలం బోగస్ ఓట్లను తొలగించడం జరుగుతుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు.తన ఓటు వివరాలను బిఎల్ఓ కు వివరిస్తు ఎస్ఐఆర్ ప్రక్రియను ఎమ్మెల్యే పూర్తి చేశారు.

బీఎల్ఓ అందించిన ఫారాలను ఎమ్మెల్యే పూర్తి చేసి వారికి అందజేశారు.అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడంతో పాటు ఓటర్ల జాబితాలో ఎలాంటి పొరపాట్లు చోటుచేసుకోకుండా చూడడమే ఈ ప్రత్యేక పరిశీలన లక్ష్యమన్నారు.

ఎస్ఐఆర్ కోసం ఇంటి సర్వేకు బిఎల్ఓ లో వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు సహకరించాలని.. తమ ధ్రువీకరణ పత్రాలతో పాటు ఫోటోను ముందుగానే ఉంచుకోవాలని పేర్కొన్నారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story