Adilabad: సాత్నాల ప్రాజెక్ట్ నుండి పంటలకు నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే పాయల్ శంకర్!

Adilabad: ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సాత్నాల ప్రాజెక్ట్ కాలువ ద్వారా పంటల సాగుకు నీటిని విడుదల చేశారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 27 Oct 2026 1:59 PM IST
Adilabad
X

Adilabad: సాత్నాల ప్రాజెక్ట్ నుండి పంటలకు నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే పాయల్ శంకర్!

Adilabad: సాత్నాల ప్రాజెక్ట్ కాలువ నుండి పంటల సాగు కోసం ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మంగళవారం పూజలు నిర్వహించి సాగునీటిని విడుదల చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సాత్నాల ప్రాజెక్ట్ పరిధిలోని దాదాపు 28,000 నుండి 30,000 ఎకరాల ఆయకట్టు పంటలకు నీరందించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు.

ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితులు, కరువు ఉన్నప్పటికీ సాత్నాల ప్రాజెక్టులో నీటి నిల్వ ఉండటం కలసివచ్చిందన్నారు. నీటిని మొత్తం 35 రోజుల ప్రణాళికతో 3 విడతలుగా విడుదల చేస్తున్నట్లు వివరించారు. రాబోయే వేసవి కాలంలో తాగునీటి అవసరాలకు కూడా కొంత నీటిని నిల్వ ఉంచాల్సిన అవసరం ఉందని, కాబట్టి రైతులు ఎక్కడా నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని సూచించారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.