Nirmal: రాహుల్ గాంధీ ఎదుగుదలను చూసి బీజేపీ ఓర్వలేకపోతోంది: ఎమ్మెల్యే!

Nirmal: దేశంలో రాహుల్ గాంధీకి పెరుగుతున్న ఆదరణను చూసి బీజేపీ ఓర్వలేకపోతోందని నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు విమర్శించారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 2 Sept 2026 7:56 PM IST
Nirmal
X

Nirmal: రాహుల్ గాంధీ ఎదుగుదలను చూసి బీజేపీ ఓర్వలేకపోతోంది: ఎమ్మెల్యే!

నిర్మల్ జిల్లా: రాజకీయంగా ఎదుగుతున్న రాహుల్ గాంధీని చూసి బిజెపి నాయకులు ఓర్వలేక పోతున్నారని నిర్మల్ జిల్లా డిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఎద్దేవా చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మాట్లాడుతూ దేశంలో రాహుల్ గాంధీపై పెరుగుతున్న ఆదరణను దెబ్బ తీసేందుకు బీజేపీ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. రాంలీలా మైదానంలో మల్లికార్జున్ కర్గే కు జరిగిన అవమానంపై రాహుల్ గాంధి ప్రశ్నిస్తే ఆయనపై కేసులు పెట్టడం సరికాదన్నారు. దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన కుటుంబంలో నుండి వచ్చిన రాహుల్ గాంధీ కేసులకు భయపడే రకం కాదని తేలిపారు. వెంటనే భేశరతుగా కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL

Next Story