Adilabad: ఆదిలాబాద్ రిమ్స్ ఎస్‌ఎన్‌సీయూ ఘటనపై ఎంపీ గోడం నగేష్ దిగ్భ్రాంతి!
Adilabad: ఆదిలాబాద్ రిమ్స్ ఎస్‌ఎన్‌సీయూ ఘటనపై ఎంపీ గోడం నగేష్ తీవ్ర దిగ్భ్రాంతి. ఆసుపత్రిని సందర్శించి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమని విమర్శ.
Adilabad: ఆదిలాబాద్ రిమ్స్ ఎస్‌ఎన్‌సీయూ ఘటనపై ఎంపీ గోడం నగేష్ దిగ్భ్రాంతి!
Adilabad: ఆదిలాబాద్‌లోని రిమ్స్ SNCU సంభవించిన సంఘటనపై ఎంపీ గోడం నగేష్ తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో అమాయకులైన చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. శుక్రవారం రిమ్స్ ను ఆయన సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రిమ్స్ లో గత కొన్ని సంవత్సరాలుగా నిర్వాహణా లోపం స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు. స్థానిక పాలన మరియు అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు.
ఆసుపత్రికి పూర్తిస్థాయి సూపరింటెండెంట్, డైరెక్టర్ లేదా RMO పోస్టులు లేకుండా, ఒకే అధికారికి పలు బాధ్యతలు అప్పగించడం వల్ల పని విభజన లేక తీవ్ర లోపాలు తలెత్తుతున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ నాయకత్వంలో సూపర్ స్పెషాలిటీ సెంటర్లు, క్రిటికల్ కేర్ యూనిట్లు, అత్యాధునిక పరికరాలను మంజూరు చేసినప్పటికీ, వాటిని నిర్వహించడంలో మరియు డాక్టర్లు, సాంకేతిక సిబ్బందిని నియమించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.




