Adilabad: అదిలాబాద్ అభివృద్ధికి ఎంపీ నగేష్ హామీ
Adilabad: అదిలాబాద్ పట్టణ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని ఎంపీ నగేష్ కౌన్సిల్ సమావేశంలో తెలిపారు.
Adilabad
Adilabad: అదిలాబాద్ పట్టణ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని బీజేపీ ఎంపీ నగేష్ తెలిపారు. మున్సిపల్ చైర్‌పర్సన్ అనూష అధ్యక్షతన నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సమావేశంలో మొత్తం 16 అజెండా అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. వార్డుల్లో నెలకొన్న పౌర సమస్యలపై కౌన్సిలర్లు ప్రశ్నించగా, సంబంధిత అధికారులు వివరణ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఎంపీ నగేష్ మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించవద్దని అధికారులను హెచ్చరించారు. పట్టణ అభివృద్ధి పనులను వేగవంతం చేసి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
Next Story




