Mudhole: ముథోల్‌లో కాంగ్రెస్, బీజేపీలకు షాక్.. బీఆర్ఎస్‌లోకి వలసలు
Mudhole: నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు సర్పంచులు, ఉప సర్పంచులు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు.
Mudhole: ముథోల్‌లో కాంగ్రెస్, బీజేపీలకు షాక్.. బీఆర్ఎస్‌లోకి వలసలు
ముథోల్: నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గం లో రాజకీయ సమీకరణలు రోజురోజుకు మారుతున్నాయి.. అధికార కాంగ్రెస్, బిజెపిల నుంచి పలువురు సర్పంచులు ఉపసర్పంచులు ఆ పార్టీలకు షాక్ గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.. నియోజకవర్గంలోని కుభీర్ మండలం నుంచి 4 గురు సర్పంచులు, ఒక ఉప సర్పంచు,తానూర్ మండలం నుంచి 7 గురు సర్పంచులు ముగ్గురు ఉపసర్పంచులు, మరికొన్ని ప్రాంతాల మాజీ సర్పంచులు, ప్రధాన నాయకులు కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు..
ముథోల్ నియోజక వర్గ పరిధిలో బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలకు చెందిన తానూర్, కుభీర్ మండలాల్లోని పలువురు సర్పంచులు, ఉప సర్పంచులు, మాజీ సర్పంచులు, ప్రధాన నాయకులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరంతా మంగళవారం కేటీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. కుభీర్ మండంలోని మాలేగాం, సాoవ్లీ , అంతర్ని, పల్సి గ్రామ పంచాయతీల సర్పంచు
లతో పాటు సిర్పెల్లి గ్రామ ఉప సర్పంచు బీఅర్ఎస్ లో చేరిన వారిలో ఉన్నారు.ఇక తానూర్ మండల పరిధి నుంచి హంగిర్గా, దహాగాం, ఎల్వీ, జౌళ (బి), తొండాల, వడోనా, సింగన్గావ్ సర్పంచులతో పాటు జౌళ(బి), మహలింగి, ఎల్వీ గ్రామ పంచాయతీల ఉప సర్పంచులు కూడా బీఆర్ఎస్ లో చేరిపోయారు. పార్టీలో చేరిన వారందరికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు..




