Adilabad: గిఫ్ట్ ఏ స్మైల్.. కేటీఆర్ పుట్టినరోజు వేళ వినూత్న సేవా కార్యక్రమం

Adilabad: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50వ జన్మదినాన్ని పురస్కరించుకుని ముఖరా (కే) మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి వినూత్నంగా స్పందించారు.

NAGULA SATISH, BOATH
Published on: 17 July 2026 11:54 AM IST
Adilabad
X

Adilabad: గిఫ్ట్ ఏ స్మైల్.. కేటీఆర్ పుట్టినరోజు వేళ వినూత్న సేవా కార్యక్రమం

Adilabad: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50వ జన్మదినాన్ని పురస్కరించుకుని ముఖరా కే గ్రామంలో వేడుకలు ముందస్తుగానే ఘనంగా ప్రారంభమయ్యాయి. ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా ఇచ్చోడ మండలం ముఖరా కే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి తన సొంత డబ్బులతో 50 నిరుపేద కుటుంబాలకు లైఫ్ ఇన్సూరెన్స్ చేయించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తమ అభిమాన నాయకుడి పుట్టినరోజు పేద కుటుంబాలకు ఆసరాగా నిలవాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఒక్కొక్కరికి రూ. 436 ప్రీమియం చెల్లించి ఈ బీమా చేయించామని, ప్రమాదవశాత్తు లేదా సాధారణ మరణం సంభవిస్తే సదరు కుటుంబానికి రూ. 2 లక్షల భీమా అందుతుందని వివరించారు. ఇంటి పెద్దను కోల్పోయి ఏ పేద కుటుంబం కూడా రోడ్డున పడకూడదనే ఈ సాయం చేసినట్లు పేర్కొన్నారు.

కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ.. జులై 24 వరకు ప్రతిరోజూ ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని మీనాక్షి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్, విట్టల్, తిరుపతి, దత్త, వెంకటి, ప్రహ్లాద్‌తో పాటు స్థానిక రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH

Next Story