Adilabad: మాట తప్పిన సీఎం.. దేవుడికే మొర పెట్టుకున్న మహిళలు!

Adilabad: కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద ఇస్తామన్న ₹2,500, తులం బంగారం హామీలను నెరవేర్చాలని ఆదిలాబాద్ ముక్రా (కే) మహిళలు వినూత్నంగా నిరసన తెలిపారు.

NAGULA SATISH, BOATH
Published on: 29 Jun 2026 7:35 PM IST
Adilabad
X

Adilabad: మాట తప్పిన సీఎం.. దేవుడికే మొర పెట్టుకున్న మహిళలు!

Adilabad: మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు నెలకు ₹2,500 మరియు ఆడబిడ్డల పెళ్లికి తులం బంగారం ఇస్తామన్న హామీలను అమలు చేయాలంటూ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా (కే) గ్రామ మహిళలు వినూత్నంగా నిరసన తెలిపారు.

ఈరోజు వట సావిత్రి పౌర్ణమి సందర్భంగా గ్రామ దేవత, వటవృక్షానికి పూజలు చేసి తమ నిరసన తెలియజేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇచ్చిన మాట నిలబెట్టుకునేలా మంచి బుద్ధి ప్రసాదించు దేవుడా అని వేడుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, మూడో వట సావిత్రి పౌర్ణమి వచ్చినా 6 గ్యారంటీల హామీలు మాత్రం నెరవేరలేదని ప్లకార్డులతో తమ నిరసన తెలియజేశారు.

ముఖ్యమంత్రి మహిళలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సాగిన ఈ నిరసన కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి, ఇందుబాయి, కూసుమబాయి, శారదా, లక్ష్మితో పాటు గ్రామ మహిళలు పాల్గొన్నారు.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH

Next Story