Basara: బాసరలో 'ఎల్ నినో'పై నాగభూషణం విద్యార్థుల అవగాహన ర్యాలీ!

Basara: నిర్మల్ జిల్లా బాసరలో గురువారం శ్రీ నాగభూషణం విద్యాలయం ప్రధానోపాధ్యాయులు బాబురావు ఆధ్వర్యంలో విద్యార్థులు ఎల్ నినో అవగాహన ర్యాలీ నిర్వహించారు.

RAMESH RATNELLI, BASARA
Published on: 19 Nov 2026 6:11 PM IST
Basara
X

Basara: బాసరలో 'ఎల్ నినో'పై నాగభూషణం విద్యార్థుల అవగాహన ర్యాలీ!

బాసర: నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో శ్రీ నాగభూషణం విద్యాలయం ప్రధానోపాధ్యాయులు బాబురావు ఆధ్వర్యంలో గురువారం ఎల్ నినో అవగాహన ర్యాలీ ఘనంగా నిర్వహించారు.

విద్యార్థులు చేతుల్లో ప్లకార్డులు పట్టుకొని, నినాదాలు చేస్తూ బాసర ప్రధాన వీధుల్లో ర్యాలీ చేపట్టారు. వివేకానంద చౌరస్తా వద్ద విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఎల్ నినో అంటే ఏమిటి, వాతావరణంలో వచ్చే మార్పులు, దాని వల్ల కలిగే నీటి కొరత, పంట నష్టం, వేడి గాలులు, అకాల వర్షాల వంటి ప్రభావాల గురించి గ్రామస్తులకు వివరించారు.

నీటిని పొదుపుగా వాడాలని, వృధా చేయవద్దని, చెట్లను కాపాడాలని, పంటలను రక్షించుకోవాలని కరపత్రాల ద్వారా అవగాహన కల్పించారు. సేవ్ వాటర్, ప్రొటెక్ట్ అవర్ క్రాప్స్ అనే నినాదాలతో ప్రజలను చైతన్యపరిచారు.

కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బాబురావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యార్థులు చేసిన ఈ అవగాహన ర్యాలీని స్థానికులు అభినందించారు.

RAMESH RATNELLI, BASARA

RAMESH RATNELLI, BASARA