Adilabad: ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం పాల్గొన్న కలెక్టర్ రాజర్షిషా!
Adilabad: ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు. హాజరైన కలెక్టర్ రాజర్షిషా, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష.
Adilabad: ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం పాల్గొన్న కలెక్టర్ రాజర్షిషా!
Adilabad: రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవ సందర్భంగా ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష తో కలిసి కలెక్టర్ పాల్గొని మేజర్ ధ్యాన్ చంద్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాజీ క్రీడాకారులను శాలువాతో సత్కరించారు. అంతకుముందు క్రీడాజ్యోతి వెలిగించి ర్యాలీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో క్రీడల అభివృద్ధికి తగిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులు జాతీయస్థాయి, రాష్ట్రస్థాయిలు రాణిస్తున్నారని పేర్కొన్నారు. సిఎస్ఆర్ నిధుల ద్వారా క్రీడా మౌలిక వసతులను మరింత మెరుగుపరుస్తామని ఆయన స్పష్టం చేశారు. క్రీడలలో రాణించిన వారికి ఉద్యోగ అవకాశాలు కూడ లభిస్తాయి అన్నారు.




