Neredigonda: వర్ష బాధితులకు కొండంత అండగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్

Neredigonda: నెరడిగొండలో వర్షాల ధాటికి ఇల్లు కూలిన బాధితులకు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పరామర్శ. సొంత నిధుల నుంచి తక్షణ సాయం, పక్కా ఇండ్ల మంజూరుకు హామీ.

NAGULA SATISH, BOATH
Published on: 30 July 2026 8:57 PM IST
Neredigonda
X

Neredigonda: వర్ష బాధితులకు కొండంత అండగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్

నెరడిగొండ: కష్టమొచ్చిన వేళ 'నేనున్నాను' అని తట్టి చెప్పే చెయ్యి ఉంటే ఎంతటి పెద్ద ఆపదైనా చిన్నబోతుంది. ఎడతెరిపి లేని కుండపోత వర్షాలకు కంటిముందే గూడు కూలిపోయి, ఆశ్రయం కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న నెరడిగొండ మండల కేంద్రానికి చెందిన మొహమ్మద్, ఈశ్వరి బాయి కుటుంబాలకు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నేరుగా వచ్చి కొండంత అండగా నిలిచారు.

ఆపద వస్తే అరనిమిషంలో మీ ముందే ఉంటాను.. ఎవరూ అధైర్యపడొద్దు, మీకు తోడుగా నేనుంటాను" అంటూ బాధితుల కన్నీళ్లు తుడిచి, గుండెలకు హత్తుకునేలా ధైర్యాన్ని చెప్పారు. భారీ వర్షం ధాటికి ​కట్టుకున్న ఇల్లు నేలమట్టమై రోడ్డున పడటంతో తల్లడిల్లిపోతున్న ఆ కుటుంబాల పరిస్థితిని చూసి ఎమ్మెల్యే చలించిపోయారు.

వెంటనే తన స్వంత నిధుల నుంచి తక్షణ ఆర్థిక సహాయాన్ని అందించి, వారికి ఆపద్బాంధవుడిలా ఆదుకున్నారు. వర్షాల వల్ల నష్టపోయిన నిరుపేదలందరికీ న్యాయం జరగాలని, వెంటనే బాధితుల జాబితా తయారుచేసి ప్రభుత్వానికి నివేదికలు పంపాలని ఎమ్మార్వో, ఎంపీడీవోలను ఆదేశించారు. బాధితులకు త్వరలోనే పక్కా ఇండ్లు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గం లోని ఏమండలంలో ఎక్కడ ఎవరికి ఏ చిన్న ఆపద వచ్చినా వెంటనే సమాచారం అందించాలని అధికారులకు, స్థానిక నాయకులకు సూచించారు.

​బాధితుల్లో నమ్మకాన్ని నింపిన ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నీలిమ రవీందర్ రెడ్డి, ఉప సర్పంచ్ గులాబ్, మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, మాజీ జడ్పీటీసీ పండరీ, నాయకులు సాబ్లే సంతోష్, రాథోడ్ సురేందర్, సుజీల్, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH

Next Story