Nirmal: సమస్యపై స్పందించిన చిన్నారి: భైంసా సబ్ కలెక్టర్‌కు వినతి
Nirmal: నిర్మల్ జిల్లా భైంసాలో కాలనీ రోడ్ల సమస్యపై స్పందించి సబ్ కలెక్టర్ అజ్మెరా సంకేత్‌ను కలిసి వినతిపత్రం అందజేసిన ఐదవ తరగతి విద్యార్థిని శ్రీదేవిక.
Nirmal: సమస్యపై స్పందించిన చిన్నారి: భైంసా సబ్ కలెక్టర్‌కు వినతి
నిర్మల్: ఇది కదా పిల్లలకు కావలసింది, ఇలా కదా పిల్లలు ఆలోచించాల్సింది, సమస్యలపై ఇప్పటినుంచి ప్రశ్నించే తత్వం ఉంటే మునుముందు ఎన్నో సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేయొచ్చు అని నిరూపించింది ఈ చిన్నారి శ్రీదేవిక.
5 th క్లాస్ చదువుతున్న శ్రీ దేవిక బైంసాలోని న్యూ సంతోషిమాత కాలనీలో తన ఫ్యామిలీతో కలిసి నివాసం ఉంటున్నారు, వర్షాల కారణంగా తన కాలనీలో ఉన్న రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి, ఆ కాలనీలో నివాసముంటున్న వారు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు.
ఈ సమస్యను వాళ్ల నాన్న గారైన ముద్దం విక్రమ్ దృష్టికి ప్రతిరోజు తీసుకెళ్లడంతో తను ఈ సమస్యను జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్లాలని తన కూతురు శ్రీదేవిక కి చెప్పాడు, దీంతో ఇంకేముంది.. తన కూతురు శ్రీదేవిక కాలనీ సమస్యలను ఒక లెటర్ పై రాసి కలెక్టర్ ని కలవాలని నిర్ణయించుకుంది.
ఈరోజు బైంసాలో జరిగే ప్రజావాణి లో సబ్ కలెక్టర్ అజ్మెరా సంకేత్ గారిని కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, దాంతో బైంసా సబ్ కలెక్టర్ అజ్మెర సంకేత్ గారు, న్యూ సంతోష్ నగర్ కాలనీ రోడ్ల సమస్యను వెంటనే పరిష్కరించాలని స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇంత చిన్న వయసులో సమస్యను తన దృష్టికి తీసుకురావడంతో చిన్నారి శ్రీదేవిక ని అభినందించారు, పెద్దయ్యాక ఏం అవ్వాలని ఉంది అని ఆ చిన్నారిని అడగడంతో, తాను కూడా మీలాగే కలెక్టర్ అవుతాను, అని చెప్పడంతో కలెక్టర్ గారు ఆ చిన్నారికి ఆల్ ది బెస్ట్ చెప్పి అభినందించారు, ఆ తథంగాన్ని చూస్తున్న మిగతా అధికారులందరూ.. ఆ చిన్నారి శ్రీదేవిక ని అభినందించారు.




