Nirmal: ఈ నెల 25 నుంచి ఆగ్రిగోల్డ్ బాండ్ల ధృవీకరణ ప్రారంభం
Nirmal: నవంబర్ 25 నుంచి ఆగ్రిగోల్డ్ బాండ్ల ధృవీకరణ; నిర్మల్ జిల్లా బాధితులు మంచిర్యాల నస్పూర్ పోలీస్ స్టేషన్ కేంద్రానికి హాజరుకావాలని ఎస్పీ జానకి షర్మిల సూచన.
Nirmal: ఈ నెల 25 నుంచి ఆగ్రిగోల్డ్ బాండ్ల ధృవీకరణ ప్రారంభం
నిర్మల్: నిర్మల్ జిల్లా బాధితులు తమకు కేటాయించిన తేదీల్లో మంచిర్యాల జిల్లా నస్పూర్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ధృవీకరణ కేంద్రానికి హాజరుకావాలి : జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆగ్రిగోల్డ్ సంస్థలో డిపాజిట్లు చేసి నష్టపోయిన బాధితులకు వెసులుబాటు కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ ఆధ్వర్యంలో అసలు ఆగ్రిగోల్డ్ బాండ్లు, నగదు రసీదుల ధృవీకరణ మరియు నమోదు ప్రక్రియ చేపట్టింది. ఈ ప్రక్రియ 25.11.2026 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కేంద్రాల్లో ప్రారంభం కానుంది.
ఈ నేపథ్యంలో నిర్మల్ జిల్లా బాధితుల కోసం మంచిర్యాల జిల్లా నస్పూర్ పోలీస్ స్టేషన్‌లో ప్రత్యేక ధృవీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల పేర్కొన్నారు. నిర్మల్ జిల్లాకు చెందిన బాధితులు తమ మండలానికి కేటాయించిన తేదీల ప్రకారం ఈ కేంద్రానికి హాజరై వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. బాధితులకు ఏవైనా అనుమానాలు ఉంటే IOP, CCS వై. కృష్ణారెడ్డి, 98853 52522 సంప్రదించాలన్నారు.
పని దినాల్లో ఉదయం 10:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు ధృవీకరణ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. నిర్మల్ జిల్లాకు చెందిన ఆగ్రిగోల్డ్ బాధితులు తమ మండలానికి కేటాయించిన తేదీ ప్రకారం మంచిర్యాల జిల్లా నస్పూర్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ధృవీకరణ కేంద్రానికి అవసరమైన అన్ని ఒరిజినల్ బాండ్లు, సంబంధిత ధృవీకరణ పత్రాలతో హాజరై తమ వివరాలను నమోదు చేసుకోవాలి. ధృవీకరణకు సంబంధించిన తేదీలు, వివరాలను ముందుగా సంబంధిత అధికారుల వద్ద నిర్ధారించుకోవాలి.
ఆగ్రిగోల్డ్ బాధితులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ బాండ్ల ధృవీకరణ, వివరాల నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని పేర్కొన్నారు.




