Nirmal: నిర్మల్ పోలీసు కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర వేడుకలు
Nirmal: నిర్మల్ జిల్లా పోలీసు కార్యాలయంలో 80వ స్వాతంత్ర వేడుకలు. జాతీయ జెండా ఆవిష్కరించిన భైంసా ఏఎస్పీ సాయి కిరణ్. పాల్గొన్న పోలీసు అధికారులు.
Nirmal: నిర్మల్ పోలీసు కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర వేడుకలు
నిర్మల్: నిర్మల్ జిల్లా పోలీసు కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జాతీయ భావం, దేశభక్తి ఉట్టిపడేలా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భైంసా ఏఎస్పీ సాయి కిరణ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసు సిబ్బంది గౌరవ వందనం స్వీకరించారు.
అంతకు ముందు జిల్లా పోలీసు కార్యాలయంలో, ఏ ఆర్ హెడ్ క్వార్టర్స్ లో పోలీసు అధికారులు, సిబ్బంది జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకలు జరుపుకున్నారు. అనంతరం పోలీసు అధికారులు, సిబ్బందిని ఉద్దేశించి ఏఎస్పీ మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం ఎన్నో త్యాగాలు చేసిన స్వాతంత్ర్య సమరయోధులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. వారి త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నామని పేర్కొన్నారు.
స్వాతంత్ర్య సమరయోధులు కలలుగన్న సురక్షితమైన, శాంతియుతమైన, అభివృద్ధి చెందిన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. పోలీసు శాఖ ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో మరింత సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్ నేరాల నియంత్రణ, మాదకద్రవ్యాల నిర్మూలన, మహిళలు, బాలల భద్రత, నేరాల నివారణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.
ప్రజలకు అందుబాటులో ఉంటూ, బాధితులకు సత్వర న్యాయం అందించే విధంగా విధులు నిర్వహించాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. ప్రజల విశ్వాసమే పోలీసు శాఖకు ప్రధాన బలమని, ఆ విశ్వాసాన్ని మరింత పెంచేలా ప్రతి పోలీసు ఉద్యోగి క్రమశిక్షణ, అంకితభావం, బాధ్యతతో విధులు నిర్వర్తించాలని ఏఎస్పీ పేర్కొన్నారు.
కార్యక్రమం అనంతరం పోలీసు అధికారులు మరియు సిబ్బంది జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బందికి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఓ ఎం.డి. యూనస్ అలీ, నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, సీఐలు కృష్ణ, సమ్మయ్య, మల్లేష్, ఆర్‌ఐలు రామ్‌నిరంజన్, త్రిపాల్, శేఖర్, రామకృష్ణ, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, డీపీఓ సిబ్బంది మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.




