Nirmal: నిర్మల్‌లో భారీ దొంగతనం: అయ్యప్ప గుడిలో సొత్తు అపహరణ!
Nirmal: నిర్మల్ దివ్యనగర్ అయ్యప్ప ఆలయంలో భారీ చోరీ. తాళాలు పగలగొట్టి బంగారం, 10 కిలోల వెండి అపహరణ. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి పోలీసుల దర్యాప్తు.
Nirmal: నిర్మల్‌లో భారీ దొంగతనం: అయ్యప్ప గుడిలో సొత్తు అపహరణ!
నిర్మల్ జిల్లా: కేంద్రంలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అయ్యప్ప స్వామి ఆలయంలో భారీ చోరీకి పాల్పడ్డారు. గుడి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు.. పెద్ద ఎత్తున బంగారం, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలోని దివ్య నగర్‌లో గల ప్రముఖ అయ్యప్ప స్వామి దేవాలయంలో అర్ధరాత్రి దొంగతనం జరిగింది. గుర్తుతెలియని దుండగులు ఆలయ తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. గర్భగుడిలోని స్వామివారికి చెందిన సుమారు 2 తులాల 3 గ్రాముల బంగారంతో పాటు, సుమారు 10 కిలోల వెండి పూజా సామాగ్రిని అపహరించుకుపోయారు.ఉదయం ఆలయానికి వచ్చిన పూజారులు, తాళాలు పగలగొట్టి ఉండటం గమనించి. లోపలికి వెళ్లి చూడగా బంగారం, వెండి వస్తువులు మాయమైనట్లు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరిస్తున్నారు. ఆలయ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దొంగలను పట్టుకునేందుకు దర్యాప్తును వేగవంతం చేశారు.




