Basar: బాసర అమ్మవారిని దర్శించుకున్న మైనంపల్లి హనుమంతరావు!
Basar: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి, మహారాష్ట్ర ఎమ్మెల్సీ హేమంత్ పాటిల్ దర్శించుకున్నారు. అనంతరం ఢిల్లీ ధర్నాకు కార్ల ర్యాలీగా బయలుదేరారు.
Basar: బాసర అమ్మవారిని దర్శించుకున్న మైనంపల్లి హనుమంతరావు!
బాసర: బాసర లోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మహారాష్ట్ర ఎమ్మెల్సీ హేమంత్ పాటిల్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
అనంతరం ఢిల్లీలో కాంగ్రెస్ తలపెట్టిన మహా ధర్నాకు కార్ ర్యాలీ ద్వారా తరలి వెళ్లారు. ప్రజల్లో కాంగ్రెస్ దూసుకుపోతుందని రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన లో బాసర క్షేత్రం అన్నీ రంగాల్లో అభివృద్ధి చెందడం ఆనందంగా ఉందని అన్నారు. స్థానిక సర్పంచి వెంకటేష్ గౌడ్ మాజీ సర్పంచ్ మమ్మయి రమేష్, తో పాటు నాయకులు కార్యకర్తలు ఉన్నారు.




