Basara: ఘోర అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం!
Basara: నిర్మల్ జిల్లా బాసర రవీంద్రపూర్ కాలనీలో షార్ట్ సర్క్యూట్‌తో షేక్ ఇబ్రహీం ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. రూ.10 లక్షల నగదు, 4 తులాల బంగారం, పెళ్లి సామాగ్రి కాలిపోయాయి.
Basara: ఘోర అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం!
బాసర: బాసరలో అగ్ని ప్రమాదంలో నష్టపోయిన ఇబ్రహీం కుటుంబాన్ని ఆదుకుంటామని తహశీల్దార్ హామీ ఇచ్చారు. బాసరలోని రవీంద్రపూర్ కాలనీలో బుధవారం ఉదయం సంభవించిన షార్ట్ సర్క్యూట్ ఘటనలో ఇబ్రహీం ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. బాసర మండల తహశీల్దార్ పవన్ చంద్ర ఆదేశాలతో ఆర్ఐ అభిమన్యు, జీపీఓ శంకర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
ఈ ప్రమాదంలో రూ.10 లక్షల నగదు, 4 తులాల బంగారం, వెండి, పెళ్లి సామాగ్రి, ఫర్నిచర్, టీవీ, బట్టలు, పాస్ పోర్ట్, పిల్లల సర్టిఫికెట్లు, విలువైన పత్రాలు కాలి బూడిదయ్యాయని బాధితులు తెలిపారు. కలెక్టర్, అధికారుల దృష్టికి తీసుకెళ్లి కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు.




