Khanapur: అటవీ ప్రాంతంలో మేకల కాపరిపై ఎలుగుబంటి దాడి

Khanapur: నిర్మల్ జిల్లా ఖానాపూర్ అటవీ ప్రాంతంలో మేకల కాపరిపై ఎలుగుబంటి దాడి. కుక్కలు తరిమికొట్టడంతో ప్రాణాలతో బయటపడిన బాధితుడు ఆసుపత్రిలో చికిత్స.

RAKESH N, KHANAPUR
Published on: 22 Sept 2026 10:55 PM IST
Khanapur
X

Khanapur: అటవీ ప్రాంతంలో మేకల కాపరిపై ఎలుగుబంటి దాడి

ఖానాపూర్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని గంగాయిపెట్ గ్రామానికి చెందిన పంతం లక్ష్మణ్ మేకల కాపరి గంగాయిపేట్ అటవీ ప్రాంతంలోకి మేకలను మేపుతుండగా అకస్మాత్తుగా అటవి జంతువు ఎలుగుబంటి లక్ష్మణ్ పై దాడి చేసి తొడ పై భాగాన గాయపరిచింది.

దీంతో బాధితుడు గట్టిగా అరుపులు కేకలు వేయగా తన కుక్కలు చుట్టుముట్టి ఎలుగుబంటిని వెళ్లగొట్టయి.. బాధితుడి భార్య ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతూన్న బాధితుడు..

RAKESH N, KHANAPUR

RAKESH N, KHANAPUR