Nirmal: నిర్మల్ బాలికల వసతి గృహంలో అవగాహన కార్యక్రమం.. వివరాలు
Nirmal: నిర్మల్ ప్రియదర్శిని నగర్ బాలికల వసతి గృహంలో బేటి బచావో బేటి పడావో అవగాహన కార్యక్రమం; చట్టాలు, భద్రత, హెల్ప్‌లైన్‌లపై విద్యార్థినులకు వివరణ.
Nirmal: నిర్మల్ బాలికల వసతి గృహంలో అవగాహన కార్యక్రమం.. వివరాలు
నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రియదర్శిని నగర్ షెడ్యూల్డ్ కులాల కళాశాల బాలికల వసతి గృహంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళా సాధికారత కేంద్రం సిబ్బంది బేటి బచావో బేటి పడావో పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి దయానంద్ సమక్షంలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం సిబ్బంది బేటి బచావో బేటి పడావో అంశాలను, బాలికల సాధికారత బాల్యవివాహాలు, బాల్య వివాహాల చట్టం, గర్భస్థలింగ నిర్ధారణ చట్టం సైబర్ క్రైమ్, సఖి చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్స్, ఆడపిల్లల చదువు ప్రాముఖ్యత, అలాగే లింగ వివక్షత, గుడ్ టచ్ బ్యాడ్ టచ్, ఋతుక్రమ పరిశుభ్రత వంటి అంశాల గురించి వివరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వసతి గృహ సంక్షేమ అధికారులు పల్లవి సౌమ్య, మహిళా సాధికారత కేంద్రం సిబ్బంది జెండర్ స్పెషలిస్ట్ లు జ్యోతి మౌనిక, భరోసా సిబ్బంది లీగల్ ఆఫీసర్ అర్చన, షీ టీం సిబ్బంది పోలీస్ కానిస్టేబుల్ విజయలక్ష్మి , విద్యార్థులు పాల్గొన్నారు.




