Bhainsa: భైంసాలో రోడ్డెక్కిన సోయా రైతులు.. మార్కెట్ ఎదుట ధర్నా!
Bhainsa: నిర్మల్ జిల్లా భైంసా మార్కెట్ యార్డులో ఈ-నామ్ సర్వర్ మొరాయించడంతో పాటు సోయాబీన్‌కు తక్కువ ధరలు పలకడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు.
Bhainsa: భైంసాలో రోడ్డెక్కిన సోయా రైతులు.. మార్కెట్ ఎదుట ధర్నా!
భైంసా: నిర్మల్ జిల్లా భైంసా వ్యవసాయ మార్కెట్ యార్డ్ ముందు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేసిన సొయా రైతులు. భైంసా మార్కెట్ యార్డులో సొయా రైతులకు తప్పని అవస్థలు, రైతులు పంట ఉత్పత్తులు విక్రయానికి తేగా, ఈనామ్ సర్వర్ సమస్యతో బీట్ నిర్వహణలో జాప్యం దీంతో ఓపెన్ ఆక్షన్ ద్వారా బీట్ నిర్వహించిన ఏఎంసీ అధికారులు అయితే. వేలంపాటలో సోయాకు తక్కువ ధరలు పలుకుతున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారు. మరోవైపు భైంసా మార్కెట్ యార్డు ముందు రైతులు బైఠాయించి ఆందోళన చేపట్టారు.
దీంతో రోడ్డుకు ఇరువైపులా భారీగా నిలిచిపోయిన వాహనాలు. సమాచారం అందుకొని ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, రాష్ట్రంలోని అన్ని ఈ నామ్ మార్కెట్ యార్డులలో ఆన్ లైన్ సేవలు కొనసాగుతుండగా భైంసా మార్కెట్ యార్డులో మాత్రమే ఎందుకు ఆన్ లైన్ సేవలు నిలిపివేస్తున్నారంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. భైంసా మార్కెట్ యార్డులో దళారుల వ్యవస్థతో రైతులకు సోయా పంటకు సరైన గిట్టుబాటు ధర దక్కడం లేదంటూ రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మార్కెట్ యార్డులోకి వచ్చిన సోయా పంటను దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ రైతులను మోసం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దళారుల వ్యవస్థను రద్దు చేసి ఆన్ లైన్ ద్వారా కొనుగోళ్లు జరిపి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేశారు.




