Nirmal: కాంగ్రెస్ పార్టీ మహిళా ద్రోహి.. గోపిడి శ్రవంతి రెడ్డి ధ్వజం

Nirmal: మహిళా రిజర్వేషన్ బిల్లు మరియు డీలిమిటేషన్ ప్రక్రియను కాంగ్రెస్ అడ్డుకోవడం చారిత్రక తప్పిదమని నిర్మల్ బిజెపి ఇంచార్జి గోపిడి శ్రవంతి రెడ్డి మండిపడ్డారు.

ANNOJULA SRINIVAS  RAO
Published on: 29 April 2026 9:47 PM IST
Nirmal
X

Nirmal: కాంగ్రెస్ పార్టీ మహిళా ద్రోహి.. గోపిడి శ్రవంతి రెడ్డి ధ్వజం

Nirmal: మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ పై అనేక రోజులుగా ఎదురుచూస్తున్న నియోజకవర్గాల పునర్విభజన చట్టం, మహిళా రిజర్వేషన్ చట్టంలో సవరణలు పార్లమెంటులో వీగిపోవడం దురదృష్టకరమని నిర్మల్ జిల్లా బిజెపి ఇంచార్జి గోపిడి శ్రవంతి రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆక్రోస్ ప్రెస్ మీట్ లో జిల్లా అధ్యక్షులు రితీష్ రాథోడ్ తో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ బిల్లులను అడ్డుకోవడం కాంగ్రెస్, వారి మిత్రపక్షాలు చేసిన చారిత్రక తప్పిదమన్నారు.

దీంతో వారు చరిత్రలో మహిళాద్రోహులుగా నిలిచిపోతారు. అసలు ఈ బిల్లును ఎందుకు వ్యతిరేకిస్తున్నారో ప్రజలకు చెప్పలేకపోతున్నారని పేర్కొన్నారు. బిల్లు పెట్టకముందు దక్షిణాదికి అన్యాయం అంటారని,ఞ బిల్లు పెట్టిన తర్వాత సీట్లు పెంచుకోవడానికి కుట్ర అంటూ ఇది వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనం అన్నారు. కేంద్ర ప్రభుత్వం 50% సీట్లు పెంచే అంశాన్ని స్పష్టంగా వెల్లడించిందని, ప్రధానమంత్రి దేశ ప్రజలకు అన్ని భాషల్లో వివరించారని, లోక్‌సభలో అఖిలపక్ష సమావేశంలో కూడా చెప్పారన్నారు.

అందరి సహకారం ఉంటుందని ఆశించి బిల్లును తీసుకొస్తేఞకాంగ్రెస్ మిత్రపక్షాలు కుట్రపూరితంగా ఈ బిల్లును, డీలిమిటేషన్ బిల్లును అడ్డుకున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా బిల్లును అడ్డుకోవడం కాంగ్రెస్‌కు ఇది మొదటిసారి కాదని. మొత్తంగా 7 సార్లు ఈ బిల్లును కాంగ్రెస్ మరియు వారి మిత్రపక్షాలు అడ్డుకున్నాయన్నారు. దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని చెన్నైలో సమావేశాలు పెట్టినవాళ్లు ఇప్పుడు అర్థంలేని విమర్శలు చేస్తున్నారన్నారు.

మోదీ ప్రభుత్వం దక్షిణాదికి మేలు చేసే ప్రయత్నం చేస్తే ఈ బంగారు అవకాశాన్ని అడ్డుకున్నారని, ఇది దక్షిణాది రాష్ట్రాలకు తీరని నష్టమని పేర్కొన్నారు. రాజకీయాల్లోకి రావాలనుకునే మహిళల ఆశలను నాశనం చేశారని. చట్టసభల్లోకి రావాలనుకున్న మహిళల భవిష్యత్తును అంధకారం చేసి బడుగు బలహీన వర్గాల మహిళలకు, విద్యావంతులకు మోసం చేశారన్నారు. ఇది బీజేపీ ఓటమి కాదని, ఇది 70 కోట్ల మహిళలను, 30 కోట్ల దక్షిణాది ప్రజలను ఓడించడం అని పేర్కొన్నారు.

రాహుల్ గాంధీ విధానం పూర్తిగా దేశ వ్యతిరేకమని, బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడిగా ఉండాల్సింది పోయి దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. సర్జికల్ స్ట్రైక్స్, ఆపరేషన్ సింధూర్‌ను అవమానించేలా మాట్లాడి సైనిక శక్తిని మాయాజాలంతో పోల్చి 140 కోట్ల భారతీయులను అవమానించారన్నారు. రాబోయే రోజుల్లో మహిళలు కాంగ్రెస్‌కు సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు . దక్షిణాదిలో ఊరూరా బీజేపీ జెండా ఎగురవేస్తామని, మోదీ గారి నేతృత్వంలో అన్ని రాష్ట్రాలకు సమన్యాయం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్, తదితరులు పాల్గొన్నారు.

ANNOJULA SRINIVAS  RAO

ANNOJULA SRINIVAS RAO

Next Story