Nirmal: నవంబర్ 3న నిర్మల్‌లో బీజేపీ ‘మహా పాదయాత్ర’

Nirmal: నవంబర్ 3న నిర్మల్‌లో బీజేపీ మహా పాదయాత్ర. 50 వేల మందితో నిర్వహిస్తున్న సభ ఏర్పాట్లు, పోలీసుల భద్రతపై శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సమీక్ష.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 31 Oct 2026 11:07 PM IST
Nirmal
X

Nirmal: నవంబర్ 3న నిర్మల్‌లో బీజేపీ ‘మహా పాదయాత్ర’

నిర్మల్: ఓటరు సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)పై కాంగ్రెస్, ఇండియా కూటమి చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు నిర్మల్ జిల్లా కేంద్రంలో నవంబర్ 3న బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహా పాదయాత్రకు భారీగా ప్రజలు తరలిరానున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు.

ఈ కార్యక్రమానికి పశ్చిమ బెంగాల్ గెలుపు లో కీలక పాత్ర పోషించిన. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ హాజరుకానున్న నేపథ్యంలో బందోబస్తు, హెలిప్యాడ్, రూట్ మ్యాప్ తదితర అంశాలపై బీజేపీ శాసనసభాపక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శనివారం పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు.

జిల్లాలోని మూడు నియోజకవర్గాల నుంచి 50 వేల మందికి పైగా పాదయాత్రలో పాల్గొనే అవకాశం ఉన్నందున జనసమీకరణకు అనుగుణంగా భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని పోలీసు అధికారులకు సూచించారు. ముఖ్య అతిథి రాక సందర్భంగా హెలిప్యాడ్ నుంచి కార్యక్రమ వేదిక వరకు రూట్ మ్యాప్, వాహనాల రాకపోకలు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల భద్రతకు సంబంధించిన అంశాలపై చర్చించారు.

పాదయాత్రకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. భారీ జనసందోహం నేపథ్యంలో పోలీసు శాఖ సమన్వయంతో అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకుల అయ్యన్నగారి భూమయ్య, తక్కల రమణారెడ్డి, జమాల్, మార గంగారెడ్డి, సాదం అరవింద్, జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్, కరీపే విలాస్, కౌన్సిలర్లు గంజి రాజు, శ్రీరామోజీ నరేష్, జింక సురేందర్, సూరజ్ నాయక్, బీజేపీ నాయకులు కందుల హరీష్, భరత్, వెంకటేష్, ప్రమోద్, ఉదయ్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL