Nirmal: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్ 250 అడుగుల ఫ్లెక్సీ నిరసన!

Nirmal: తెలంగాణలో కాంగ్రెస్ 1000 రోజుల పాలన వైఫల్యాలపై నిర్మల్ ఆర్‌డీఓ కార్యాలయం ఎదుట బీఆర్‌ఎస్ ధర్నా. 250 అడుగుల ఫ్లెక్సీ ప్రదర్శన, బాకీ కార్డుల పంపిణీ.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 2 Sept 2026 3:26 PM IST
Nirmal
X

Nirmal: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్ 250 అడుగుల ఫ్లెక్సీ నిరసన!

Nirmal: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న తరుణంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపేందుకు, ఇచ్చిన హామీల అమలు తీరును నిలదీసేందుకు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా భారీ నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.

ఈ నిరసన కార్యక్రమాల్లో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ పార్టీ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ,250 అడుగులతో ప్రభుత్వ వైఫల్యాలను తెలిపే ఫ్లెక్సీల ప్రదర్శన ఏర్పాటు చేశారు.

అనంతరం పార్టీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీల అమలులో జరుగుతున్న అలసత్వాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు బీఆర్ఎస్ కీలక వ్యూహం రచించిందన్నారు.గత వెయ్యి రోజుల్లో ప్రభుత్వం ప్రజలకు ఏమేం చేయడంలో విఫలమైందో బాకీ కార్డు ద్వారా ప్రజలకు వివరించనున్నామన్నారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL

Next Story