Nirmal: నిర్మల్‌లో కిరాణా దుకాణాల్లో అధికారుల తనిఖీలు!

Nirmal: నిర్మల్ జిల్లా కేంద్రంలో సివిల్ సప్లై అధికారులు కిరాణా షాపుల్లో తనిఖీలు చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బియ్యం అమ్మాలని, ఎక్కువ రేట్లకు అమ్మితే కేసులు తప్పవని హెచ్చరించారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 3 Nov 2026 5:31 PM IST
Nirmal
X

Nirmal: నిర్మల్‌లో కిరాణా దుకాణాల్లో అధికారుల తనిఖీలు!

నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని పలు కిరాణా దుకాణాల్లో సివిల్ సప్లై, లీగల్ మెట్రాలజీ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా దుకాణాల్లో నిల్వ ఉన్న బియ్యం వివరాలను వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ప్రభుత్వ ధరల ప్రకారం బిపిటి 66, ఆర్ఎన్ఆర్ బియ్యాన్ని 74, హెచ్ఎంటి బియ్యాన్ని 79 రూపాయలకే విక్రయించాలని సూచించారు.

ఈ ధరలు ప్రజలకు తెలిసే విధంగా బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రతి దుకాణ యజమాని ప్రభుత్వం నిర్ణయించిన ధరకే బియ్యాన్ని విక్రయించాలని, లేనట్లయితే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు.

ఎవరైనా వ్యాపారులు ఎక్కువ ధరకు బియ్యం విక్రయించినా, కృత్రిమ కొరత సృష్టించేందుకు ప్రయత్నించినా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ తనిఖీల్లో డీఎస్ఓ రాజేందర్, ఏ ఎస్ ఓ సాగర్, లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ శంకర్, వ్యాపారులు ఆమెడ శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL