Nirmal: నిర్మల్ కలెక్టరేట్‌లో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు!

Nirmal: నిర్మల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్య్ర వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Updated on: 15 Aug 2026 12:31 PM IST
Nirmal
X

Nirmal: నిర్మల్ కలెక్టరేట్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు!

Nirmal: 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో శనివారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కలెక్టర్ భవేష్ మిశ్రా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులకు, సిబ్బందికి, విద్యార్థులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

దేశ స్వాతంత్య్ర కోసం ప్రాణత్యాగాలు చేసిన మహనీయుల సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని దేశాభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి అంకితభావంతో కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని తెలిపారు.

విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని, భవిష్యత్తులో దేశానికి మంచి పౌరులుగా ఎదగాలని కలెక్టర్ ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులకు నోట్‌బుక్‌లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, కలెక్టర్ క్యాంపు కార్యాలయ అధికారులు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL

Next Story